చొరబాటుదార్లకు కొమ్ముకాయడం, రాజకీయ లబ్థికి దిగడం తృణమూల్ కాంగ్రెస్ నిజరూపం అని ప్రధాని నరేంద్ర మోడీ కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో విమర్శించారు. అక్రమ వలసదార్లు ఓటుబ్యాంక్‌లు కావడంతోనే ఇప్పుడు టిఎంసి ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తోందని ప్రధాని చెప్పారు. టిఎంసి హయాంలో సరిహద్దులు దాటి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ అయింది. దీనితో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జనాభాపరంగా చాలా అసమతూకత ఏర్పడింది.

