తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్ రావడాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసిన కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద మండిపడ్డారు. కమల్ హాసన్ పోస్టుని ట్యాగ్ చేస్తూ.. ”ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్‌లోకి వచ్చారు. అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి” అని చిన్మయి రాసుకొచ్చింది. గతంలో ‘మీటూ’, కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

