భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే జ్ఞానపీఠ్ అవార్డు ఈ ఏడాది తమిళ కవి ఆర్. వైరముత్తును వరించింది. 2025 సంవత్సరానికి గాను (60వ జ్ఞానపీఠ్) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వైరముత్తు, నాలుగు దశాబ్దాలుగా సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు. కవిత్వం, నవలలతో కలిపి ఆయన 37కు పైగా పుస్తకాలను రచించారు. ఇక సినీ గీత రచయితగా అనేక హిట్ గీతాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు.

