ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా దాదాపు 10వేల ఏఐ డ్రోన్లను పశ్చిమాసియాలో మోహరించిందని యూఎస్ బ్రాడ్‌కాస్టర్ ఏబీసీ న్యూస్ తెలిపింది. మెరోప్స్ అని పిలిచే ఈ డ్రోన్లను, మాజీ గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్‌కు చెందిన పెరెన్నియల్ అటానమీ అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్స్ శత్రువులకు చెందిన డ్రోన్లను వేటాడి నాశనం చేయడానికి రూపొందించారు. ఇప్పటికే వీటిని ఉక్రెయిన్ వార్‌లోనూ ఉపయోగించారు. ఈ మెరోప్స్, ఇరాన్ నుంచి రష్యా కొనుగోలు చేసిన షాహెద్ డ్రోన్లను కూల్చివేశాయని ఓ అధికారి చెప్పారని ఏబీసీ పేర్కొంది.

