‘అల్లు సినిమాస్’ థియేటర్లో వాల్ ఆఫ్ ఫేమ్ పేరుతో ఇండియాలోని దిగ్గజ దర్శకుల ఫోటోలను ఏర్పాటు చేశారు అయితే ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, రిషబ్ శెట్టి, అట్లీ వంటి రెండు, మూడు సినిమాలు తీసిన డైరెక్టర్లను లెజెండరీ డైరెక్టర్లుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎక్కించడంతో తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. భారత సినీ చరిత్రలో గర్వంగా చెప్పుకునే కేవీ రెడ్డి, జంధ్యాల, బాపు, రామ్ గోపాల్ వర్మ, సింగీతం, కోదండ రామిరెడ్డి,కృష్ణవంశీ,శంకర్ వంటి దర్శకుల ఫోటోలు లోకపోవటం ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

