పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతుల్లా మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా? లేదా? మోజ్తాబా ఖమేనీ “ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడని” తాను నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్ రాయబారి అలీరెజా సలారియన్ కూడా మోజ్తాబా గాయపడినట్లు ధ్రువీకరించారు. ఆయన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని,
అందుకే రహస్య ప్రదేశంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

