ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ (PBKS) ఫ్రాంచైజీ గురువారం తమ కొత్త మ్యాచ్ జెర్సీని అత్యంత ఆకర్షణీయంగా ఆవిష్కరించింది. ఎరుపు, నీలం రంగుల అద్భుతమైన మేళవింపుతో ఈ జెర్సీని రూపొందించారు. జెర్సీ మధ్యలో సింహం బొమ్మ, వజ్రాల ఆకృతులలోకి మారుతుందని ఫ్రాంచైజీ పేర్కొంది. “సింహం దూకుడు, ప్రతిభకు ప్రతీక అయితే… కఠోర శ్రమ, ఒత్తిడిలో రాటుదేలిన తర్వాత ఆ ప్రతిభ వజ్రంలా మారుతుందనడానికి ఈ డైమండ్స్ నిదర్శనం” అని తెలిపింది.

