ప్రపంచ ప్రఖ్యాత ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్‌కు ఐకానిక్ స్టెప్స్ కంపోజ్ చేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పాట్రిసన్, మన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ టాలెంట్‌ను మెచ్చుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ‘RRR’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ లెజెండ్స్ దృష్టిని ఆకర్షించాయి. హాలీవుడ్లో అత్యున్నత స్థాయి కొరియోగ్రఫీని అందించిన పాట్రిసన్ వంటి వ్యక్తి, ఇండియన్ టాలెంట్‌ను గుర్తించి అభినందించడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.

