రాష్ట్ర విద్యుత్ చరిత్రలో మొదటి సారి ఏపీ జెన్కో 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో లైఫ్ టైం రికార్డు సాధించిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్కో)ను స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ నమోదు కాని విధంగా 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 5730 మెగావాట్ల ఎక్స్-బస్ ఉత్పత్తి సాధించడం ముఖ్యమంత్రి దార్శనికతతో ఇచ్చిన సలహాలు, సూచనలతో పాటు జెన్కో సిబ్బంది ప్రత్యేక కృషి ప్రధాన కారణమని మంత్రి పేర్కొన్నారు.

