టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు, తన గాత్రంతోనూ, సంగీతంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే, ఆయన పెళ్లాడబోయే అమ్మాయి మరెవరో కాదు… టాలీవుడ్ యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు కుటుంబాల్లో వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ముహూర్తాలు ఖరారైన తర్వాత సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

