ప్రయాగరాజ్ మహా కుంభమేళా పూసల దండలు అమ్ముకుంటూ.. రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెలబ్రిటీగా మారిన బ్యూటీ మోనాలిసా గత ఏడాదిన్నర కాలంగా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. వీరిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మతాలు, ప్రాంతాలు వేరు కావడంతో మెనాలిసా కుటుంబం వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. మోనాలిసా తండ్రి.. సినిమా షూటింగ్కు వచ్చి బలవంతంగా కూతురిని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో మోనాలిసా తన ప్రియుడితో కలిసి రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.

