నల్గొండ జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్‌పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) అరెస్ట్ వారెంట్ జారీ చేయడం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భూ వివాదానికి సంబంధించిన కేసులో ఎమ్మార్వో సమగ్రంగా విచారణ జరిపి పూర్తి స్థాయి రిపోర్టును తమకు సమర్పించాలన్న కమిషన్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది.

