మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అత్యంత శక్తివంతమైన మెరుపు దాడులకు దిగింది. దాదాపు ఒక టన్ను బరువున్న భారీ వార్హెడ్లతో కూడిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సహా పలు ప్రధాన నగరాలు దద్దరిల్లాయి. ఈ బాంబు దాడుల ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది.

