కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా పేలుడు ప్రమాదంలో దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు తన తండ్రిని కోల్పోయింది. అంతకు ముందే ఆమె తల్లి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో దుర్గ ఒంటరిగా మిగిలిపోయింది. దుర్గ దీన గాథ అభిమానులు, సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ కు చేరింది. అనాథలా మిగిలిపోయిన మానసిక దివ్యాంగురాలి పరిస్థితిని చూసి చలించిపోయాడు బన్నీ. దుర్గ సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు. నెలకు రూ.7,500 చొప్పున జీవితాంతం దుర్గ బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేశాడు.

