పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థలో,నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో,గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు, అక్రమ లావాదేవీల ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులను బయటకు కదలనివ్వకుండా దస్త్రాలను తనిఖీలు చేస్తున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు విస్తృతంగా ఏసీబీ ప్రత్యేక బృందాలు తనిఖీలను చేపట్టాయి.

