ఇరాన్ తమ దేశ నూతన సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. కొత్త సుప్రీం లీడర్‌గా అయతొల్లా ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 56 ఏళ్ల అయతొల్లా సయ్యద్ మొజ్తాబా హొస్సేని ఖమేనీ అలియాస్ మొజ్తాబా ఖమేనీ ఇరాన్‌కు మూడో సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాడు. ఇరాన్ అసెంబ్లీ నిపుణుల బృందంలో 88 మంది ఇస్లాం మత గురువులు ఉంటారు. వీరందరూ కలిసి ఆదివారం సమావేశమై కొత్త సుప్రీం లీడర్ కోసం చర్చ జరిపారు. మెజారిటీ సభ్యులు మొజ్తాబా వైపు మొగ్గు చూపారు.

