తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ, ప్రైవేట్ వ్యక్తులు విజయ బ్రాండ్ పేరుతో కల్తీ పాలు, నెయ్యి విక్రయిస్తున్నారంటూ తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ ఫ్రాంచైజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల మార్కెట్లోకి నాణ్యత లేని ఉత్పత్తులు వస్తున్నాయని, ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు.విజయ బ్రాండ్ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) నివేదిక ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

