పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్లోని అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని తెలిపారు. అంతేకాక.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు సిఎం కానీ, మంత్రుల నుంచి కానీ అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఆదివాసీ సదస్సుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. అయినప్పటికీ మమత ప్రభుత్వంపై ఎటువంటి ద్వేషం లేదని.. ఆమె తనకు సోదరితో సమానమని అన్నారు.

