హెచ్-1బి (H-1B) వీసాపై ఉంటూ, డల్లాస్లో MAD Dance అనే పేరుతో ఒక డాన్స్ స్టూడియో నిర్వహిస్తున్న మధు రాజు జంట అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం (World War II Memorial) వద్ద చేసిన డాన్స్ రీల్ తీవ్ర విమర్శల పాలయింది. యుద్ధ వీరులను అవమానించారని మండిపడుతున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను గౌరవించాల్సిన చోట ఇలాంటి ప్రవర్తన సరికాదంటూ అమెరికన్ నెటిజన్లు, ఈ వ్యవహారాన్ని అమెరికా విదేశాంగ శా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

