ఒక వ్యక్తి ఏ దుస్తులు వేసుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని, దానిపై ఇతరులు తీర్పు ఇవ్వడం సరైంది కాదని ఆమె అన్నారు. ఒక అమ్మాయి బ్రా స్ట్రాప్ అనుకోకుండా బయటకు కనిపిస్తే అది పెద్ద తప్పు చేసినట్లుగా లేదా ప్రపంచమే అంతమైపోయినట్లుగా ఎందుకు చూస్తారని ఆమె ప్రశ్నించారు. మహిళల దుస్తులను విమర్శించడం కంటే, మనుషుల ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సూచించారు. “సరస్వతి” చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలపై మాట్లాడారు.

