టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మికలు పెళ్లి అనంతరం నూతన దంపతులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివాహ వేడుక ఫోటోలను షేర్ చేస్తూ రష్మిక హృదయాన్ని తాకే సందేశాన్ని పోస్ట్ చేశారు. రష్మిక పోస్ట్‌కి 15 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాగా,విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్‌కి కొద్ది గంటలలోనే 13 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇద్దరికి కలిపి 28 మిలియన్స్‌కి పైగానే వ్యూస్ వచ్చాయి. ఇది సరికొత్త రికార్డ్ అంటున్నారు.

