తమిళ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ హైదరాబాద్‌లో తన తొలి లైవ్ కాన్సర్ట్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 21, 2026న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యూజిక్ షోపై భారీ ఆసక్తి నెలకొంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే అభిమానులు భారీగా స్పందించడంతో వేగంగా అమ్ముడవుతున్నాయి. మొత్తం 30,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పటికే 1.5 లక్షలకు పైగా టికెట్ రిక్వెస్టులు రావడం విశేషం.

