దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి… చలి పూర్తిగా తగ్గి ఎండలు మొదలయ్యాయి. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం కారణంగా ఫిబ్రవరి 20న దక్షిణ తమిళనాడు, తీరప్రాంతాలు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

