ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు. డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ ‘ఏఐ ఫర్ ఆల్’ అనే ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు.

