విదేశీ మహిళపై అత్యాచారం కేసులో కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి సమీపంలో గతేడాది మార్చి 6న జరిగిన ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం, అమెరికన్ పర్యాటకుడి హత్య కేసులో ముగ్గురు దోషులకు కర్ణాటకలోని గంగావతి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక్ ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించారు.

