ఇది కేవలం సాధారణ భూమిపూజ కార్యక్రమం కాదు. ఈరోజు అమరావతిలో భారతదేశ క్వాంటమ్ టెక్నాలజీలలో భవిష్యత్ నాయకత్వానికి పునాది వేస్తున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మూడు బలాలు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు క్వాంటమ్ విప్లవాన్ని భారత్ ఎందుకు అనుసరించాలి? దేశమే దానిని ఎందుకు ముందుండి నడిపించకూడదు అని. ఆ ప్రశ్నకు సమాధానమే అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ప్రపంచంలోనే మొట్టమొదటిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టి క్వాంటమ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం.

