ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ విండీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. ముఖ్యంగా రొమారియో షెపర్డ్ హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి.. వెస్టిండీస్ విజయానికి బాటలు వేశాడు. దీంతో స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగుల చేసి ఆలౌట్ అయింది.

