వైఎస్ జగన్ ఏపీలో పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ వివిధ జిల్లాల్లో పర్యటించేటప్పుడు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. కనీస విచక్షణ లేకుండా ఇష్టాను సారం వెళ్తానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాగా, మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

