భారత్- అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరడంపై కాంగ్రెస్ స్పందించింది. మోదీ కౌగిలింతలు, ఫోటో షూట్లు దేశానికి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించింది. స్నేహితుడు ఎన్నటికీ స్నేహితుడిగా కొనసాగబోడంటూ (దోస్త్ దోస్త్ నా రహా) వ్యంగ్యాస్త్రాలు సంధించింది. హౌడీ మోదీ కంటే నమస్తే ట్రంప్‌దే పైచేయి అయ్యిందని ఎద్దేవా చేసింది. భారత్- అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో డీల్ వివరాలను సరిగ్గా ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.

