బంగారం ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. గత రికార్డు ధరలను బద్దలు కొడుతూ పసిడి దూసుకుపోతోంది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.5,020 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.4600 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.1,54,800కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,41,900కు పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.3,40,000గా ఉంది.

