ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ధ్రువీకరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 8 వేల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. 2030 నాటికి ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

