ఇవాళ ముస్లింల పవిత్ర దినమైన షబ్-ఈ-మేరజ్(జగ్నే కి రాత్) దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని పలు ప్రధాన ఫ్లైఓవర్లు మూసి వేస్తున్నారు. నేడు(జనవరి 16) రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్లను మూసి వేయనున్నారు. జనవరి 16, 17 తేదీలలో జరిగే షబ్-ఈ-మేరజ్ పండుగ దృష్ట్యా.. గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రేస్‌వే.. ఇంకా లంగర్ హౌస్ ఫ్లైఓవర్లు మినహా హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తారు. అవసరమైతే తెలంగాణ తల్లి, షేక్‌పేట్, మన్మోహన్ సింగ్, బహదూర్‌పురా ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్లనూ బంద్ చేస్తామని చెప్పారు.

