దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగర పాలక సంస్థ (BMC) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది. మొత్తం 227 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ దాటేసి ఏకంగా 120 సీట్లు కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ ఒక్కటే 93 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, మిత్రపక్షం శివసేన (షిండే వర్గం) 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు మూడు దశాబ్దాల పాటు ముంబైపై ఏకచక్రాధిపత్యం వహించిన ఠాక్రే కుటుంబం ఈసారి అధికారాన్ని కోల్పోయింది.

