ధరణి,భూభారతి రిజిస్ట్రేషన్లను అడ్డు పెట్టుకుని జనగామ, యాదాద్రి జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ రూ. 3.90 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్న 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు, వీరు వెబ్సైట్లోని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్లను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్ రుసుమును సాఫ్ట్వేర్ ద్వారా తగ్గించేవారు. రైతుల వద్ద నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ నకిలీ రసీదులను సృష్టించేవారు.

