అమరావతిని జగన్ వ్యతిరేకించలేదని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఇల్లు అమరావతిలోనే ఉందన్నారు. పెద్దపెద్ద భవనాలను కడుతూ ప్రజాధనం వృధా చేస్తున్నారనే జగన్ ప్రశ్నించారన్నారు. అమరావతి అనేది కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని, అక్కడ చంద్రబాబు నాయుడు తన అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు.
జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు.

