ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవం నిర్వహించారు. పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించిందని, పెద్ద కంపెనీలకు సిఇవోలుగా ఉన్నది.. మన దేశంవాళ్లేనని రేవంత్ పేర్కొన్నారు. పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా.. అని తనని అడిగే.. తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానని, వివాదాలు కావాలా.. పరిష్కారం కావాలా.. అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతానని అన్నారు.

