ప్రపంచ చెస్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి.గుకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం 12 ఏళ్ల రష్యన్ బాలుడు సెర్గీ స్క్లోకిన్ చేతిలో గుకేష్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా ఒక చిన్న పొరపాటు కారణంగా గుకేష్ ఈ మ్యాచ్‌ను కోల్పోవడం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమైంది. ఇటీవలే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత స్టార్ డి.గుకేష్, బ్లిట్జ్ ఫార్మాట్లో మాత్రం తడబడ్డడు.

