భారత్ నుంచి మలేరియాను త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నేడు అహ్మదాబాద్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్వహించిన ఆలిండియా మెడికల్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రసంగించారు. భారత్‌లో మలేరియా కేసులు 97 శాతం తగ్గాయని, అతి త్వరలో దేశం నుంచి పూర్తిగా మలేరియాను తరిమేస్తామని అన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరమని, అందుకు డాక్టర్లు.. ప్రభుత్వ పథకాల లక్ష్యం నెరవేరేలా కలిసి పనిచేయాలని కోరారు.

