జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. ధరూర్ మండలం నందిన్నె మాజీ సర్పంచి చిన్న భీమా రాయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మొదట అందరూ దీన్ని సాధారణ రోడ్డు ప్రమాదంగానే భావించారు. కానీ వారం రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించి సంచలన నిజాలను బయటపెట్టారు. పైకి కనిపించిన ప్రమాదం వెనుక రూ.25 లక్షల సుపారీ ఒప్పందం ఉందని, నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించి పక్కా స్కెచ్‌తో హత్య చేసినట్లు నిర్ధారించారు. రాజకీయ కక్షలు, భూ వివాదాలే ఈ హత్యకు కారణమని తేల్చారు.

