డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పిఎస్ పరిధిలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు ప్రేమ జంటతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుల్లో ముగ్గురు పెడ్లర్లు, ఒక వినియోగదారుడు ఉన్నారు. వారి నుంచి 22 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి, 5 గ్రాముల ఎండిఎంఎ, 5.5 గ్రాముల ఎక్స్టసీ పిల్స్, 6 ఎల్ఎస్డి బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇమాన్యుయేల్, సుస్మిత అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అతడితో కలిసి .విలాసాలకు అలవాటు పడి మత్తు పదార్థాలను విక్రయిస్తోంది.

