కెనడాలోని టొరంటోలో హిమాన్షీ ఖురానాఅనే 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. డిసెంబర్ 19న ఖురానా అదృశ్యమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఓ ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఖురానాపై తొలుత లైంగిక దాడి జరిగినట్టు అనుమానం వ్యక్తం చేసిన అధికారులు..ఆపై హత్యకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా..ఈ హత్యకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తోన్న గఫూరీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

