ఐఫోన్లు సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్ (Foxconn) భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన తన కొత్త యూనిట్లో కేవలం 8-9 నెలల్లో దాదాపు 30,000 మంది కార్మికులను నియమించుకుంది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉండటం విశేషం. 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీలో ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16 మోడల్‌ను ఉత్పత్తి చేయగా.. ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ తయారీని ప్రారంభించారు.

