వన్డే ఛాంపియన్ భారత జట్టు తొలి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. విశాఖపట్టణంలో జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ ఫామ్‌ను కొనసాగించిన జెమ్మీ.. స్మృతి మంధాన(25)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(15 నాటౌట్)తో కలిసి కూల్‌గా ఆడిన జెమ్మీ.. టీమిండియాను 8 వికెట్లతో గెలిపించింది.భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో లంక 6 వికెట్ల నష్టానికి 121కే పరిమితమైంది.

