రాష్ట్రంలోని నదీ జలాలపై చర్చిద్దామని.. అందుకోసం అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా జల దోపిడి జరిగిందని ఆయన విమర్శించారు. మూడు జిల్లాలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ ఆని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు – రంగారెడ్డికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేవని ఆయన పేర్కొన్నారు.

