సిక్కుల ఊరేగింపును న్యూజిలాండ్ నిరసనకారులు అడ్డుకున్నారు. ఆ దేశ యుద్ధ కళ ‘హాకా’ ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రపంచీకరణ, వలసలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూజిలాండ్‌లోని సౌత్ ఆక్లాండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న సిక్కులు శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు. రాజకీయ, మతపరమైన ప్రాముఖ్యత ఉన్న బ్రియాన్ టమాకి నేతృత్వంలోని ‘ట్రూ పేట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్’ గుంపు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ‘ఇది న్యూజిలాండ్. ఇండియా కాదు’ అంటూ పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు.

