తెలంగాణలో గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పా ఏమీ లేదని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. విశాఖ సదస్సులో చంద్రబాబు వంటవాళ్లతో ఎంఓయూలపై సంతకాలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. MOUలు నిజమైతే ఇప్పటికే ఏపీలో 20 లక్షలకు పైగా కోట్లు పెట్టుబడులు ఉండేవన్నారు. బిజినెస్ మీట్ ఏ ప్రభుత్వమైనా పెట్టాలి. కానీ లెక్కపత్రం లేని అడ్డగోలు ఒప్పందాలతో నాటకాలు చేస్తారు. లేనిపోని హైప్ తీసుకొస్తారా. దీనికి ఆద్యుడు ఆయన గురువు చంద్రబాబు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు.

