ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అతని దగ్గర హైదరాబాద్ పాస్‌పోర్టు లభ్యమైంది. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోనే బీకామ్ పూర్తి చేశాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. స్టూడెంట్ వీసాపై 1998 నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లాడని పేర్కొన్నారు. అక్కడే యూరప్‌లోని ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోను వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు.

