ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఘటనపై బాధితుల తరఫు న్యాయవాది మైక్ ఆండ్రూస్ కీలక వ్యాఖ్యలు చేశారు. విమానం కూలిపోయి ఆరు నెలలు గడిచినా బాధిత కుటుంబాలు సమాధానాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ముఖ్యమైందేనని, అయితే అసలేం జరిగింది, విమానం ఎలా కూలింది, ఎందుకు కూలిందనే సమాచారం అంతకంటే ముఖ్యమైందని ఆయన తెలిపారు.

