అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలసలపై కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వీసాల జారీ విషయంలోనూ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కొందరు అమెరికా పౌరసత్వం పొందేందుకు టూరిస్ట్ వీసాతో డెలివరీ కోసం అమెరికా వెళ్తుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. బిడ్డకు జన్మనివ్వడం కోసం టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.

