ముల్లాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన
సౌతాఫ్రికా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, సెంచరీని మిస్ చేసుకున్నాడు. 90 పరుగుల వద్ద రనౌట్ అయ్యి, పెవిలియన్ చేరాడు డి కాక్..

